ప్రశాంతత కోసం యోగా సెంటర్‌లో జాయిన్ అయిన Samantha ..! హ్యాపీ ప్లేస్ అంటూ పోస్ట్

by Hamsa |
ప్రశాంతత కోసం యోగా సెంటర్‌లో జాయిన్ అయిన Samantha ..! హ్యాపీ ప్లేస్ అంటూ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత, విజయ్ దేవరకొండతో నటించిన ‘ఖుషి’ చిత్రం త్వరలో విడుదల కానుంది. అలాగే ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ షూటింగ్ పూర్తి అయింది. అయితే సామ్ ఒక సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకుంటుందని పలు వార్తలు వచ్చాయి. తాజాగా, సామ్ తన ఇన్‌స్టాస్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. కోయంబత్తూర్ ఈశా యోగా సెంటర్ ఫొటోను షేర్ చేస్తూ ‘హ్యాపీ ప్లేస్’ అంటూ క్యాప్షన్ ఇచ్చి వైట్ కలర్ హార్ట్ సింబల్‌ను జత చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు ప్రశాంతంగా ఉండడం కోసం అందులో జాయిన్ అయిందని అనుకుంటున్నారు.

Read more : Samantha-Naga Chaitanya లకు.. రెండు మూడు పెళ్లిళ్లు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు



Next Story