టాలీవుడ్ స్టార్ హీరోలపై పగబట్టిన సమంత.. ఏం చేస్తుందంటే?

by Jakkula Samataha |
టాలీవుడ్ స్టార్ హీరోలపై పగబట్టిన సమంత.. ఏం చేస్తుందంటే?
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ సమంత‌కు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది. సినిమా, ప్రేమ, వివాహం, విడాకులు, మయోసైటీస్, సినిమాలకు బ్రేక్, మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇలా ఎన్నో ఇష్యూస్ సమంతకు సంబంధిచినవి నెట్టింట తెగ హల్ చల్ అవుతూనే ఉంటున్నాయి.అయితే మయోసైటీస్ వ్యాధి బారిన పడి కోలుకున్న తర్వాత సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, వెకేషన్స్ ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ మధ్యనే ఈ అమ్మడు,మళ్లీ తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ప్రస్తుతం సమంత టాలీవుడ్ స్టార్ హీరోస్‌పై రివేంజ్ తీర్చుకుటుందంట.

అది ఎలా అంటే? ప్రస్తుతం సమంతకు టాలీవుడ్‌లో స్టార్ హీరోస్ నుంచి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయంట. కానీ వాటిని సామ్ రిజక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే? గతంలో ఆమె పట్ల వాళ్లు బిహేవ్ చేసిన పద్ధతి, విడాకులు తీసుకున్న తర్వాత ఎవరు కూడా ఆమెకు సపోర్ట్ చేయకపోవడం , ఆమె మనసుకు హర్టింగా అనిపించిందని, అందుకే ఇప్పుడు వాళ్ళ సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని ఓ వార్త వైరల్ అవుతుంది. కాగా, ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story