పాలిటిక్స్‌లోకి సమంత.. బీఆర్ఎస్‌‌‌లో కీలక పోస్ట్..?

by Anjali |   ( Updated:2023-09-06 07:21:21.0  )
పాలిటిక్స్‌లోకి సమంత.. బీఆర్ఎస్‌‌‌లో కీలక పోస్ట్..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఎక్కువగా సినీ ఇండస్ట్రీ వారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పాలిటిక్స్‌లోకి వస్తుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణ ప్రజలకు సమంత అంటే ఎక్కువ అభిమానం ఉంటుంది. రైతన్నలకు మద్ధతుగా ఇప్పటికి చాలా కార్యక్రమాల్లో పాల్గొంది. అలాగే తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నటువంటి ఈమెను బీఆర్‌ఎస్‌కు ఆహ్వానించి, స్టార్ క్యాంపెయిన్‌గా ప్రచారం చేయిస్తే పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారట. ఇందులో ఎంత వరకు నిజముందో లేదో తెలియదు కానీ బీఆర్‌ఎస్ అధిష్టానం సామ్‌తో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఈ విషయంపై సమంత ఫ్యాన్స్.. తనకు రాజకీయాల్లోకి రావడం అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికే అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతుంది. ఇలాంటి పుకార్లు తీసుకురావద్దని కొందరు, దీనిపై క్లారిటీ రావాలంటే స్వయంగా సమంతనే స్పందించాలని మరికొంతమంది అంటున్నారు.

ఇవి కూడా చదవండి: ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే తెలుగు, హిందీ సినిమాలు ఇవే..

Advertisement

Next Story

Most Viewed