ఎట్టకేలకు ముసుగు తొలగించిన సమంత.. స్పెషల్ డే నాడు అలాంటి పోస్ట్!

by Hamsa |
ఎట్టకేలకు ముసుగు తొలగించిన సమంత.. స్పెషల్ డే నాడు అలాంటి పోస్ట్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైంది. మయోసైటీస్ రావడంతో ఇండస్ట్రీకి దూరమై చికిత్స తీసుకుంటుంది. ఇటీవల వ్యాధి కాస్త తగ్గుముఖం పట్టడంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రస్తుతం పలు యాడ్స్ చేస్తూ సినిమా ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే ఖాళీగా ఉండకుండా ఓ హెల్త్ పాడ్ కాస్ట్ మొదలెట్టి పలు విషయాలు తెలియజేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో పలు గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

తాజాగా, సమంత స్పెషల్ డే నాడు మేకప్ అనే ముసుగును తొలగిస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది. నో ఫిల్లర్ డే సందర్భంగా.. మేకప్ లేకుండా దర్శనమిచ్చింది సామ్. అంతేకాకుండా.. ‘‘నాతో పాటు ప్రపంచాన్ని చుట్టేయండి. సూర్యకిరణాలను చర్మాన్ని తాకించండి. వెన్నెలలో అల్లరి చేయండి. పదండి.. సీతాకోకలు ఎగురుతున్నాయి’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు మేకప్ ఉన్నా లేకున్నా సమంత అందంగా మెరిసిపోతుందంటూ ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed