SAMANTHA : నాగ చైతన్య పర్ఫెక్ట్ ప్లాన్‌తో మోసం చేశాడు.. సామ్ ఫోటోలను కూడా వాడాడు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-13 08:45:32.0  )
SAMANTHA : నాగ చైతన్య పర్ఫెక్ట్ ప్లాన్‌తో మోసం చేశాడు.. సామ్ ఫోటోలను కూడా వాడాడు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..
X

దిశ, సినిమా : నాగ చైతన్యకు కొత్తగా ఎంగేజ్మెంట్ అవడం ఏమో కానీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ పోస్టులే దర్శనమిస్తున్నాయి. రెండో పెళ్లి చేసుకోబోతున్నా.. కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నా.. అనే సంతోషంలో ఆయన ఉంటే.. నెటిజన్లు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. విడాకులు ప్రకటించక ముందే సమంత ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు డిలీట్ చేసి క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఆమెను ఆడిపోసుకున్నారు కానీ అసలు తిట్టాల్సింది చైతును అంటున్నారు. సింపతీ కార్డు యూజ్ చేస్తూ ర్ రెండేళ్లుగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడని.. విడాకుల విషయం మరిచిపోవడంతో అంతకు ముందు నుంచే మెయింటెన్ చేస్తున్న రిలేషన్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని ఫైర్ అవుతున్నారు.

అంతేకాదు ఇన్నాళ్లు సమంత ఫోటోలను IG లో ఉంచింది కూడా ఎవరికి డౌట్ రాకూడదనే అంటున్నారు. మొత్తానికి తండ్రికి తగిన తనయుడు అనిపించుకుంటున్నాడు.. ఆ జీన్స్ ఎక్కడికి పోతుందిలే అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ జనాలు అసలు విషయం తెలియకుండా సమంతను టార్గెట్ చేశారు అని పోస్టులు పెడుతున్నారు. కాగా దీనిపై రియాక్ట్ అవుతున్న కొందరు.. 'ఒక రిలేషన్ వర్క్ అవుట్ కాలేదంటే ముందుగా అమ్మాయిలనే బ్లేమ్ చేస్తారు.. ఇకనైనా గ్రో అప్ అవండి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

Shobhitha Dhulipala: నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్.. అరుదైన ఘనత సాధించిన అక్కినేని కోడలు

(VIDEO CREDIT SAM's FAN GIRL AARA INSTAGRAM CHANNE

Advertisement

Next Story

Most Viewed