- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్ ఖాన్ టైగర్ 3.. ఒక్క రోజులో ఎంత వసూలు చేసిందంటే
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన టైగర్ 3 చిత్రం దీపావళి కానుకగా విడుదలైంది. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని రాబట్టింది. కాగా టైగర్ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకునే ఓపెనింగ్ డే కలెక్షన్‌ను నమోదు చేసి రూ.40 కోట్లు దాటింది. దేశ వ్యాప్తంగా 5500 స్క్రీన్‌లు, ఓవర్సీస్ లో 3400, స్క్రీన్ లలో విడుదలైంది.
కాగా ఈ సినిమా మొదటి రోజు అన్ని భాషల్లో 44.50 కోట్లు వసూలు చేసింది. పూర్తిగా యాక్షన్ సీన్లతో నిండిపోయిన ఈ చిత్రం.. మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహించగా, ఆదిత్య చోప్రా రచనను అందించారు. ఈ చిత్రం నవంబర్ 12 దేశవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది.