మహిళల డ్రెసింగ్‌పై సల్మాన్ ఆంక్షలు.. యంగ్ బ్యూటీ కామెంట్స్ వైరల్

by Anjali |   ( Updated:2023-04-13 11:44:03.0  )
మహిళల డ్రెసింగ్‌పై సల్మాన్ ఆంక్షలు.. యంగ్ బ్యూటీ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కి సీ కి జాన్’. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ‌లో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించగా.. వెంకటేష్ దగ్గుబాటి, జగపతి బాబు, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది మూవీ యూనిట్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాలక్ తివారీ.. సెట్‌లో మహిళల దుస్తుల విషయంలో సల్మాన్‌కు ఓ నియమం ఉందని షాకింగ్ కామెంట్ చేసింది.

‘సెట్స్‌లో లో నెక్ లైన్ ధరించే మహిళల పట్ల సల్మాన్ కఠినంగా ఉంటారు. అంటే స్త్రీలకు నచ్చిన దుస్తులు ధరించకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాడని కాదు భద్రత గురించి ఆలోచిస్తారు. మీకు నచ్చింది వేసుకోండి కానీ సురక్షితంగా ఉండండి అని చెప్తుంటారు’ అని తెలిపింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ఇది పరోక్షంగా బాడీ షేమింగ్ చేయడం లాంటిదేనని, అమ్మాయిల దుస్తులపై ఆంక్షలు విధించే అధికారం ఆయనకు లేదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: హీరోయిన్ పూర్ణతో లవ్ ఎఫైర్ : క్లారిటీ ఇచ్చిన రవిబాబు


Advertisement

Next Story