నా జీవితంలో ప్రత్యేక క్షణాలు ఇవే.. సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్

by sudharani |
నా జీవితంలో ప్రత్యేక క్షణాలు ఇవే.. సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా : నేచురల్ యాక్టింగ్‌తో అభిమానులను ఫిదా చేసే సాయి పల్లవికి సౌత్‌ ఇండస్ట్రీలో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. కమర్షియల్ హంగులకు కాకుండా కథకే ప్రాధాన్యతిచ్చే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. విషయానికొస్తే.. ఆదివారం బెంగళూరులో జరిగిన ఫిలింఫేర్ అవార్డు వేడుకల్లో సాయి పల్లవి ఈ ఏడాది తాను నటించిన 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగరాయ్' చిత్రాలకు గాను ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది. ఈ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తూ.. 'జీవితంలో ఇలాంటి విషయాలు తరచూ జరగవు! ఒకే ఏడాది రెండు చిత్రాలకు ప్రశంసలు అందుకోవడవం చాలా ప్రత్యేకం. ఈ పాత్రల పట్ల నాకు లభించిన అపారమైన ప్రేమకు నేను కృతజ్ఞురాలిని. అలాగే ఇలాంటి అందమైన పాత్రలు మరెన్నో పొందాలని ప్రార్థిస్తున్నాను' అని రాసుకొచ్చింది.

Advertisement

Next Story