Sai Pallavi: ముచ్చటగా మూడోసారి బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్.. దర్శకుడు ఎవరంటే?

by Anjali |   ( Updated:2024-09-13 06:41:52.0  )
Sai Pallavi: ముచ్చటగా మూడోసారి బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్.. దర్శకుడు ఎవరంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆనంద్, లీడర్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, అనామిక, ఫిదా, లవ్ స్టోరీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ డైరెక్టర్.. నేచురల్ బ్యూటీ సాయిపల్లవికి రెండు సూపర్ హిట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ సరసన ఫిదాలో నటించింది. నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి.

తాజా సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే సాయి పల్లవి ముచ్చటగా మూడో సినిమాకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో గట్టి టాక్ వినిపిస్తుంది. కథానాయికగా సాయిపల్లవిని ఎంపిక చేసుకోగా.. హీరోగా నేచురల్ స్టార్ నానిని అనుకుంటున్నారట. కాగా వీరిద్దరు కలిసి ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో కలిసి అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే. మూడోసారి కూడా ఈ కాంబో రిపీట్ కానుందని టాక్ వినిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే ఇద్దరి నేచురల్ స్టార్స్‌తో మళ్లీ సినిమా అంటే ఎగిరిగంతులేస్తున్నారు. మరీ దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed