- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ రన్‌టైమ్ మూడున్నర గంటలా?
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇటీవల రిలీజైన పాటల్లో రణ్‌బీర్‌కపూర్, రష్మిక కెమిస్ట్రీ, లిప్‌లాక్‌లు హైలైట్ కాగా ఈ లిప్‌లాక్‌లు సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీని తీసుకొచ్చాయి. కథ ప్రకారం తండ్రీకొడుకుల డ్రామాతో రూపొందుతోన్న ఈ సినిమాలో రణ్ బీర్‌కు తండ్రిగా బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటిస్తుండగా బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు.
ఇక డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ మూవీ రన్‌టైమ్‌పై తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా మూడున్నర గంటల లెంగ్త్‌తో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘యానిమల్’ మూవీకి రెండు ఇంటర్వెల్ బ్రేక్స్ ఇవ్వాలంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇక ఎందుకు మూడున్నర గంటలు రన్ టైమ్ అంటే.. స్టోరీ కన్వీన్సింగ్‌గా చెప్పాలంటే రన్‌టైమ్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని డైరెక్టర్ సందీప్ వంగా నిర్ణయించుకున్నాడట. అందుకే రన్ టైమ్ తగ్గించకుండా కంటిన్యూ చేస్తున్నారు.