- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 2.5 కోట్ల చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్న అమీషా పటేల్.. ఫైన్ ఎంతంటే?
దిశ, వెబ్‌డెస్క్: ‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు అమీషా పటేల్. తర్వాత ‘‘బద్రి, నాని, నరసింహుడు’’ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది ఈ హీరోయిన్. తరచూ నెట్టింట బోల్డ్ ఫోటో షూట్స్‌తో అలరించే ఈ భామ గతంలో స్టార్ నిర్మాత అజయ్ కుమార్ వద్ద సినిమా ఒప్పందం చేసుకుని.. రూ.2.5 కోట్లు తీసుకుంది. తర్వాత పలు కారణాల వల్ల ఆ మూవీ చేయలేదు. తాను నిర్మాతకు మనీ కూడా తిరిగి ఇవ్వలేదని సమాచారం. అంతేగాక, అమీషా ఒకసారి చెక్ బౌన్స్ చేసిందట. దీంతో నిర్మాతలు తనపై కేసు పెట్టారట. కాగా, కేసు విచారణలో ఉండగా అమీషా వాయిదాలకు హాజరు కాలేదట.
దీంతో జడ్జి అరెస్టు వారెంట్ జారీ చేశారని సమాచారం. ఇక చేసేది ఏమీ లేక తను ఏప్రిల్ నెలలో కోర్టులో లొంగిపోయారు. అయితే విచారణకు పిటిషనర్ అజయ్ కుమార్ సింగ్ తరపున సాక్ష్యం చెప్పేందుకు కంపెనీ మేనేజర్ టింకు సింగ్ హాజరయ్యారు. హీరోయిన్ అమీషా పటేల్ తరపు న్యాయవాది టింకు సింగ్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉండగా ఆయన హాజరు కాలేదు. అసహనానికి గురైన జడ్జి అమీషాకు రూ.500 జరిమానా విధించారు. కాగా, తదుపరి విచారణ ఆగస్టు 7కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెట్టింట ఇది హాట్ టాపిక్‌గా మారింది.