- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాట్‌మ్యాన్‌ను వెనక్కి నెట్టిన 'ఆర్‌ఆర్‌ఆర్'.. 54 దేశాల్లో టాప్-10లో ప్లేస్
దిశ, సినిమా :'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ బజ్ ఇప్పట్లో తగ్గేలా లేదు. ఈ సినిమా విడుదలై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఏదో ఒక విశేషంతో ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షమైనా, ఓటీటీల్లో కొత్త రికార్డులైనా 'ఆర్‌ఆర్‌ఆర్' హవా కొనసాగుతూనే ఉంది.
ఈ క్రమంలో వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హాలీవుడ్ మూవీ 'బ్యాట్‌మ్యాన్' 85% రేటింగ్ సంపాదించగా.. అదే సమయంలో 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ 91% రేటింగ్ సాధించడం విశేషం. ఇక గత నెలలోనే 'జీ5, నెట్‌ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చిన 'ఆర్‌ఆర్‌ఆర్' ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ రికార్డులు సృష్టించడం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లిష్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియా సహా పలు ఇతర దేశాల్లోనూ నంబర్ వన్‌గా నిలిచింది. ఈ మేరకు మెత్తం ఎనిమిది దేశాల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. 54 దేశాల్లో టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా కొనసాగింది. ఈ నేపథ్యంలో దీన్ని తెలుగు ఇండస్ట్రీకి దక్కిన గొప్ప విషయంగా వర్ణిస్తున్నారు ఫిల్మ్ క్రిటిక్స్.