మరో ఇంటర్నేషనల్ అవార్డుకు నామినేట్ అయిన ‘RRR’

by Hamsa |   ( Updated:2023-06-06 06:32:30.0  )
మరో ఇంటర్నేషనల్ అవార్డుకు నామినేట్ అయిన ‘RRR’
X

దిశ, సినిమా: టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ హవా ఏమాత్రం తగ్గడం లేదు. మన దేశంలో ప్రస్తుతం ఈ మూవీ గురించి అంతగా టాక్ వినపడనప్పటికీ, విదేశాల్లో మాత్రం రోజుకో కోణంలో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా బెస్ట్ ఫారిన్ మూవీ ట్రైలర్ కట్ జాబితాలో, ప్రముఖ ‘ఇంటర్నేషనల్ గోల్డెన్ ట్రైలర్ అవార్డ్స్’లో ఇతర దేశాల మూవీ ట్రైలర్స్‌తోపాటు మన ‘RRR’ ట్రైలర్ కట్ కూడా నామినేషన్‌లో నిలిచింది. ఇక యూఎస్ లో ఈ సినిమా రీ రిలీజ్‌కి ప్లాన్ చేసిన ఈ ట్రైలర్ కట్‌తో నెక్ట్స్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. దీన్నిబట్టి చూస్తే ఈ అవార్డు కూడా మన జక్కన చిత్రానికే రావడం పక్కా అనిపిస్తోంది.

Read More... Adivi Sesh: బిగ్ బ్రేకింగ్‌.. అడివి శేష్‌ పెళ్లి తేదీ ఫిక్స్? ఎప్పుడో తెలుసా?

సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న పవన్ కల్యాణ్.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్..!

Advertisement

Next Story