హీరోయిన్‌గా రోజా కూతురు? ఆ స్టార్ హీరో కుమారుడితో కలిసి ఎంట్రీ

by sudharani |   ( Updated:2022-09-19 06:54:23.0  )
హీరోయిన్‌గా  రోజా కూతురు? ఆ స్టార్ హీరో కుమారుడితో కలిసి ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సీనియర్ హీరోయిన్స్‌‌లో రోజా ఒకరు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రాజకీయాల్లో సత్తా చాటుతూనే.. జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా నవ్వులు పూయించి ప్రేక్షకులను మరింత అలరించింది. ఇక ఎంపీగా పదవీస్వీకారం చేసిన తర్వాత కూడా తన పూర్తి జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే రోజా కూతురు అన్షు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తల్లికి తగ్గ తనయురాలిగా తనదైన స్టైల్లో గుర్తింపు పొందుతుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతుంది. తాజాగా అన్షును హీరోయిన్‌గా రోజా పరిచయం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అన్షు.. అమెరికాలోని ఫేమస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు సాధించింది. ఈ నేపథ్యంలోనే ఒక స్టార్ హీరో కొడుకుతో ఎంట్రీ ఇవ్వనుందట. అతడు ఎవరో కాదు స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్.. ఇటీవలే తండ్రితో కలిసి మహాన్ సినిమాలో నటించి మెప్పించిన ధృవ్.. టాలీవుడ్‌లోకి ఒక మంచి స్క్రిప్ట్‌తో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడట ఈ క్రమంలోనే రోజా కూతురు.. విక్రమ్ కొడుకు జంటగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తేలాల్సి ఉంది.

Also Read : భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న ఐశ్వర్యరాయ్.. ఆ నీళ్లు తాగితే

Advertisement

Next Story

Most Viewed