- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగచైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లిపై ఆర్జీవీ సంచలన కామెంట్స్.. పెళ్లి, చావు రెండూ ఒక్కటే అంటూ
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి వీరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోయారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ చై ఓ ఇంటి కాబోతున్నాడని, ఫుల్ ఖుషీలో ఉంటే.. సామ్ ఫ్యాన్స్ మాత్రం శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉండటం వల్లనే సమంతను చైతన్య వదిలేసాడు అని మండిపడుతున్నారు. అలాగే వీరిద్దరిపై తెగ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వీరి పెళ్లిపై అలాగే జరుగుతున్న రచ్చ పై తనదైన శైలిలో స్పందిస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశాడు.
ఆయన మాట్లాడుతూ.. శోభితా వల్లే సమంత, నాగచైతన్య విడిపోయారనే వాదనపై వర్మ చెబుతూ, ఈ పుకార్లన్నీ వాళ్ల వినోదం కోసం సృష్టించుకున్నవే. వాళ్ల ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాట్లాడుకునేవి. ఆ సమస్య అనేది ఆ ముగ్గురికి సంబంధించిన విషయం. కానీ, బయటి వాళ్ళు మాట్లాడటమనేది కేవలం వాళ్ల వినోదం కోసం మాత్రమే.అదంతా సోషల్ ఎంటర్‌టైన్‌మెంట్. కానీ ఇందులో అంతిమంగా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం ఆ ముగ్గురే. ఆ ముగ్గురు ఏమనుకుంటున్నారనేది వాళ్లిష్టం. దానిపై మనం కామెంట్ చేయలేమని తెలిపారు వర్మ.
అలాగే నాగార్జున పెళ్లికి మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా అనే ప్రశ్న అడుగగా.. దానికి ఆర్జీవి నేను వెళ్ళను అని.. అయినా నాగార్జునకు తాను రాను అని తెలుసు అని అందుకే అతను కూడా నన్ను పిలవడని తెలిపారు.. అలాగే నేను చావును, పెళ్లిని ఒకేలా చూస్తానని.. చావు అంటూ స్వేచ్చ జీవితం నుంచి మరో లోకంలోకి వెళ్లిపోతున్నట్టు అలాగే పెళ్లి కూడా స్వేచ్చని వదిలేసి మరో లోకంలోకి వెళ్లిపోతున్నట్టే అని తెలిపారు. తన దృష్టిలో పెళ్లి చావు ఒక్కటే అంటూ రామ్‌గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది.