- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RGV: రాజ్ తరుణ్-లావణ్య రిలేషన్‌పై ఆర్జీవీ సంచలన ట్వీట్.. మనుషుల మాటలు బట్టి క్యారెక్టర్ ఏంటో చెప్పొచ్చంటూ
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్-లావణ్య వివాదం గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కేసులో పలు సెన్సేషనల్ విషయాలు బయటపడుతూ వివాదం ముదురుతోంది తప్ప ఓ కొలిక్కి రావడం లేదు. అయితే ఇటీవల లావణ్య తనను 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ వాడుకున్నాడని మాల్వి మల్హోత్రా వల్ల దూరం పెడుతున్నాడని చెప్పి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా తనకు అబార్షన్ కూడా చేయించాడని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా.. మాల్వీ మల్హోత్రాను కూడా మధ్యలోకి లాగి ఆమెపై కూడా కేసు ఫైల్ చేసింది. ఇక మాల్వీ కూడా రెండు సార్లు లావణ్యపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ కేసులో రాజ్ తరుణ్ కోర్టుకు వెళ్లగా కాస్త ఊరట లభించింది. హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లావణ్య, రాజ్ తరుణ్ వివాదంలో ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చి పలు షాకింగ్ నిజాలు బయటపెట్టడంతో వివాదం కాస్త ముదిరింది.
ఇక తనపై లావణ్య దాడి కూడా చేయించిందని శేఖర్ బాషా చెప్పడంతో గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, రాజ్ తరుణ్, లావణ్య వివాదంపై వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘‘రాజ్ తరుణ్- లావణ్య ఇష్యూ సందర్భంలో పురుషులు-స్త్రీల మధ్య సంబంధాల భయాందోళనలపై నా పరిశీలనలు’’ అని రాసుకొచ్చాడు. అలాగే రాము ఇజం పేరుతో పలు క్లిప్స్ విడుదల చేశాడు. ‘‘ వారిద్దరి విషయం నాకూడా తెలిసింది. ఆమె మాట్లాడే దాన్ని బట్టి క్యారెక్టర్ తెలుస్తోంది. ఫ్యాక్ట్ ఏంటంటే.. 11 ఏళ్ల రిలేషన్‌లో ఎన్నో వచ్చాయి. డ్రగ్స్, ఇంకా ఎఫైర్స్ ఎన్నో విన్నాను. ఇవన్నీ వచ్చినప్పుడు నేను ఒక్కటే అనుకున్నాను క్రిమినల్ మైండ్ ఉన్నవాళ్లే అలా చేస్తారనిపించింది. అయితే రాజ్ నాతో 11 ఏళ్లు సహజీవనం అంటుంది. మళ్లీ అతనే కావాలని లావణ్య చెప్తుంది. రాజ్ మాత్రమే కావాలంటే.. అది చాక్లెట్ కాదు కదా. పెళ్లి చేసుకుని 20-30 ఏళ్లు కలిసి కాపురం చేసిన వాళ్లే విడిపోతున్నారు. ఇక సహజీవనం చేసి విడిపోవడం అసలు పాయింటే కాదు.
అయితే లావణ్య ఆడియో క్లిప్స్ విడుదల చేయడం చూస్తుంటే క్రిమినల్ మెంటాలిటీ అని తెలుస్తోంది. అలాంటి వాళ్లకు క్రిమినల్ ఆలోచనలే వస్తాయి. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఉండడం అంటే అసంభవం. రాజ్ మాత్రమే కావాలని లావణ్య అంటుంది కానీ చివరకు ఇదంతా డబ్బుతోనే సెటిల్ అవుతుంది అనిపిస్తుంది. అలాంటి మనిషితో ఎలా కలిసి ఉంటారు. ఈ వివాదంలో ఉన్న వారందరి పేర్లు నేను బయటకు చెప్పలేను. కానీ అన్నింటిలో మినీ స్టోరీస్ ఉన్నాయి. పోలీసులు కూడా అరెస్ట్ వరకే చేయగలరు. అంతేకానీ ప్రాబ్లం సాల్వ్ చేయలేరు. కాబట్టి ఆ అమ్మాయిని వదిలించుకోవాలంటే అలాగే చేస్తారు కానీ డ్రగ్స్ కేసులో ఇరికించరు. ఎవరో మనుషుల్ని తీసుకెళ్లి కొట్టించడం.. అంటే ఒక అమ్మాయికి ఉన్న ఒక కంపెనీ అలాంటిది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఆర్జీవీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది తెలుసుకున్నవారు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఒ నెటిజన్ ఈ వీడియోపై మాటలు బట్టి మనిషి క్యారెక్టర్‌ను చెప్పగలిగితే.. రామ్ గోపాల్ వర్మ బూతులు మాట్లాడరు కాబట్టి ఆయన అసలైన పతివ్రత అని కామెంట్ పెట్టాడు.
My observations on the RELATIONSHIP HORRORS between MEN and WOMEN in the context of Raj Tarun and Lavanya ISSUE https://t.co/Y4FTfmnVSC
— Ram Gopal Varma (@RGVzoomin) August 11, 2024
- Tags
- RGV