ఎన్.శంక‌ర్ చేతుల మీదుగా 'రివెంజ్' ట్రైల‌ర్ లాంచ్!

by sudharani |   ( Updated:2023-10-10 16:34:19.0  )
ఎన్.శంక‌ర్ చేతుల మీదుగా రివెంజ్ ట్రైల‌ర్ లాంచ్!
X

దిశ, సినిమా: ఆది అక్షర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై, బాబు పెదపూడి హీరోగా న‌టిస్తూ నిర్మించిన చిత్రం 'రివెంజ్'. రెట్టడి శ్రీనివాస్ ద‌ర్వకత్వం వహించిన ఈ చిత్రంలో నేహదేశ్ పాండే హీరోయిన్‌‌గా నటించింది. అయితే ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ప్రముఖ ద‌ర్శకుడు ఎన్.శంక‌ర్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోహి, అశోక్ రెడ్డి, చ‌ర‌ణ్ సాయి, మోహ‌న్ గౌడ్‌, మాణిక్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ద‌ర్శకుడు ఎన్.శంక‌ర్ మాట్లాడుతూ.. 'రివెంజ్' చిత్ర ద‌ర్శకుడు శ్రీను నాకు మంచి మిత్రుడు. మ‌ద్రాస్ నుంచి మా ఇద్దరి జ‌ర్నీ ప్రారంభ‌మైంది. త‌ను మంచి రైట‌ర్, ద‌ర్శకుడు. సినిమానే ప్రాణంగా బతికే వ్యక్తి. ఈ సినిమాతో త‌న‌లో ఉన్న మ‌రో కోణాన్ని మ‌న‌కు ప‌రిచయం చేయ‌బోతున్నాడు. ట్రైల‌ర్ చాలా బాగుంది.

బాబుగారిని ఒక మంచి న‌టుడుగా ప‌రిచ‌యం చేయాల‌న్న ఉద్దేశంతో ద‌ర్శకుడు త‌న‌కోసం ఒక మంచి క్యార‌క్టర్ డిజైన్ చేసి ఈ క‌థ అల్లుకున్నాడు. ద‌ర్శకుడు, హీరో క‌మ్ ప్రొడ్యూస‌ర్ ఇద్దరూ కూడా సినిమా అంటే ఎంతో ప్యాష‌న్, డెడికేష‌న్ ఉన్న వ్యక్తులు. ఈ సినిమా స‌క్సస్ సాధించి ప‌నిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా' అన్నారు. ఇక చిత్ర ద‌ర్శకుడు రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. '30 ఏళ్లుగా సినిమా రంగంలో ఉంటున్నా. విజ‌య్ భాస్కర్, వంశీ గార్ల వంటి ప్రముఖ ద‌ర్శకుల వ‌ద్ద ప‌ని చేశాను. పొద‌రిల్లు, ఐపిసి సెక్షన్ రెండు సినిమాలు డైర‌క్ట్ చేశాను. ఇది మూడో సినిమా. హీరో, నిర్మాత బాబుగారిని అనుకోకుండా క‌లిశాను. ఆయ‌న ప్యాష‌న్ చూశాక ఒక మంచి క‌థ రాయాల‌ని డిసైడ్ అయ్యాను. చాలా పాత్రలు రాశాను. చివ‌రిగా 'రివెంజ్' క‌థ తీశాం. మొద‌ట క్యార‌క్టర్ రాసి ఆ త‌ర్వాత సినిమా క‌థ రాశాను. క‌థ‌లో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. త్వర‌లో రిలీజ్ చేస్తాం'' అన్నారు.

Advertisement

Next Story

Most Viewed