అనారోగ్యంతో బాధపడుతున్న Renu Desai .. పోస్ట్ వైరల్

by Harish |   ( Updated:2023-06-20 11:21:40.0  )
అనారోగ్యంతో బాధపడుతున్న Renu Desai .. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పింది. గత కొన్నేళ్ల నుంచి తాను అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నానంటూ ఆందోళన చెందుతోంది. 'నా శ్రేయోభిలాషులందరికీ ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. నేను పలు ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నా. నాలాగే ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపేందుకు ఈ విషయాన్ని చెబుతున్నా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ధైర్యాన్ని కోల్పోవద్దు. బలంగా నిలబడాలి. ఏదో ఒక రోజు మనకు దానికి తగ్గ ఫలితం లభిస్తుంది. ఎదురు చూడాలి. మన జీవితం మీద మనకు నమ్మకం ఉండాలి. ప్రస్తుతం నాకు ఇప్పుడు చికిత్స జరుగుతోంది. మందులు వాడుతున్నాను. యోగా చేస్తున్నాను. మంచి పోషకాహారాన్ని తీసుకుంటున్నా. త్వరలోనే మామూలు మనిషినై తిరిగి వస్తా. మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాను' అంటూ ఇన్‌స్టా వేదికగా చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story