‘Bahubali’ మూవీ టీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన Renu Desai ..!

by Dishaweb |   ( Updated:2023-08-22 04:49:53.0  )
‘Bahubali’ మూవీ టీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన Renu Desai ..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌ ఇటీవల నార్వేలో జరిగింది. నార్వేలోని స్టావెంజర్‌‌ ఒపేరా హౌస్‌లో జరిగిన ఈ స్క్రీనింగ్‌కు రాజమౌళి, రమా రాజమౌళి, రాఘవేంద్ర రావు, నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్, తనయుడు అకీరా నందన్ కూడా వెళ్లారు. ఇక తాజాగా ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ రాజమౌళి, చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు.

‘ముందుగా ‘బాహుబలి’ మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన భారతీయ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మాలాంటి ప్రేక్షకుల కోసం మీరు ఇచ్చిన ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను మాటల్లో చెప్పలేను. స్టావెంజర్‌‌లో సినిమా చూసేందుకు నన్ను, అకీరను ఆహ్వానించినందుకు శోభు గారికి థాంక్స్. ఇక అక్కడి ప్రేక్షకులు కొన్ని నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు’ అని చెబుతూ అక్కడి ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి : నాగార్జున ‘మన్మథుడు’ రీరిలీజ్ డేట్ ఫిక్స్..

Advertisement

Next Story