Perfect Strangers: 8 ఏళ్లలో 26 సార్లు రీమేక్.. తెలుగులో ఆ సినిమా పేరు ఇదే..

by Prasanna |
Perfect Strangers: 8 ఏళ్లలో 26 సార్లు రీమేక్.. తెలుగులో ఆ సినిమా పేరు ఇదే..
X

దిశ, సినిమా: ఒక భాషలో బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీని ఇంకో మరో భాషలో రీమేక్ చేయడం ట్రెండ్ అయిపోయింది. ఇప్పటికిప్పుడు కొత్త కథ రాసి అది హీరో హీరోయిన్లకి వినిపించి వాళ్ళ తో ఓకే చెప్పించుకునే కన్నా ఇది ఈజీ అంటూ దీన్ని ఫాలో అవుతున్నారు.

ఇది ఎక్కువగా బాలీవుడ్, టాలీవుడ్లో కనిపిస్తుంటుంది. అయితే, ఈ మూవీ ఏకంగా 26 సార్లు రీమేక్ అయి ‘గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌’ సొంతం చేసుకుంది. తాజాగా హిందీలో ‘ఖేల్‌ ఖేల్‌మే’ అనే పేరుతో హిందీలో రిలీజ్ కు సిద్దమవుతుంది.

ఈ సినిమా పేరు ‘పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్’ 2016లో రిలీజ్ అయినా ఇటాలియన్‌ మూవీ ఇది. 2023 నాటికి 25 భాషల్లో రీమేక్‌ చేశారు. కన్నడలో ‘లౌడ్‌ స్పీకర్‌’ రీమేక్‌గా కాగా, మలయాళంలో ‘12th మ్యాన్‌’, తెలుగులో ‘రిచి గాడి పెళ్లి’ గా తెరకెక్కించారు. తాజాగా, బాలీవుడ్‌లో ‘ఖేల్ ఖేల్ మేన్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌, తాప్సి, ప్రజ్ఞా జైశ్వాల్‌, అమ్మీ వ్రిక్‌, వాణీకపూర్‌, ఫర్దీన్‌ఖాన్‌, ఆదిత్య సీల్‌, ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 15న థియేటర్లలో సందడీ చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed