Tamanna: అమ్మాయిలందరూ ఆ స్టార్ హీరోనే పెళ్లి చేసుకోవాలనుకుంటారు.. మిల్క్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
Tamanna: అమ్మాయిలందరూ ఆ స్టార్ హీరోనే పెళ్లి చేసుకోవాలనుకుంటారు.. మిల్క్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అన్ని సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘బాహుబలి’(Bahubali) సిరీస్‌తో ఎంతగా ఫేమ్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ ముద్దుగుమ్మ డాన్స్‌(Dance)కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పుకోవచ్చు. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ రెబల్ స్టార్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమన్నా మాట్లాడుతూ.. “చాలా మంది నాకు తెలిసి ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. నేను ప్రభాస్ క్రేజ్ కేవలం మన దగ్గర మాత్రమే ఉందని అనుకున్నాను. కానీ బాహుబలి రిలీజ్ తర్వాత దేశవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. ‘బాహుబలి’ సినిమా తర్వాత మన దేశంలోని అమ్మాయిలు ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. బాహుబలిలో అమరేంద్ర బాహుబలి పాత్ర లాగానే ప్రభాస్ నిజ జీవితంలో కూడా చాలా సాధారణంగా ఉంటాడు. రియల్ లైఫ్‌లోనూ డార్లింగ్.. రాజులా ఉంటాడు. అతని మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి" అని తమన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed