Tomatoes: హైబ్రిడ్ & లోకల్ టమాటాలు.. ఆరోగ్యానికి ఏవి మంచివి?

by Anjali |   ( Updated:2024-10-27 10:12:25.0  )
Tomatoes: హైబ్రిడ్ & లోకల్ టమాటాలు.. ఆరోగ్యానికి ఏవి మంచివి?
X

దిశ, వెబ్‌డెస్క్: దాదాపు అన్ని భారతీయ వంటకాల్లో టమాటా(Tomato) వాడుతారు. టమాటా వంటకాల్లో రుచిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇవి కాకుండా టమాటాలో విటమిన్ కె, విటమిన్ సి, లైకోపీన్(Lycopene), పొటాషియం, మినరల్స్(Minerals) మరియు యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants) పుష్కలంగా ఉన్నాయి. టమాటా అధిక రక్తపోటును నియంత్రించడంలో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు(Cholesterol levels) తగ్గుతాయి. టమాటా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అయితే టమాటాలు రెండు రకాలు ఉంటాయి. మన ఇండియాలో రెండు రకాల టమాటాలు పండిస్తారు. ఒకటి దేశీ, రెండు హైబ్రిడ్ అని పిలుస్తారు.

దేశీ అండ్ హైబ్రిడ్ టమాటా(Hybrid tomato)ల మధ్య చాలా తేడా ఉంటుంది. అయితే దేశీ (లోకల్)టమాటాల్లో ఏ రసాయనాలు లేకుండా పండిస్తారు. దీంతో ఈ టమాటాలు టేస్టీగా, పోషక విలువలు(Nutritional values) మెరుగ్గా ఉంటాయి. లేత ఎరుపు కలర్‌లో ఉండే హైబ్రిడ్ టమాటాలు గట్టిగా ఉంటాయి. కానీ వీటిలో రుచి, రసం ఉండవు. అలాగే హైబ్రిడ్ టమాటాలు పండించడానికి మందులు అధికంగా వాడుతారు. ఆరోగ్యానికి కూడా మంచివి కాదు. దేశీ టమాటాలు గాఢమైన రుచినిస్తాయి. వీటిలో గుజ్జు(Pulps), జ్యూసీ(Juicy) పలుచని తోలు ఉంటుంది. ఈ టమాటాలు పండినప్పుడు ఈజీగా విరిగిపోతుంది. హైబ్రిడ్ టమాటాలు టేస్ట్ అంతగా ఉండదు. అందుకే దేశీ టమాటాలకు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంటుంది. కాగా ప్రజలు ఎక్కువగా దేశీ టమాటాలనే ఇష్టపడుతారు. రుచి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed