Simmar dating : కంటికి నచ్చితే సరిపోదు..! ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి!!

by Javid Pasha |
Simmar dating : కంటికి నచ్చితే సరిపోదు..! ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి!!
X

దిశ, ఫీచర్స్ : చూపులూ చూపులు కలిసి.. ఆకర్షణల జడిలో తడిసి అర్థం చేసుకునే దాకా ఎదిగే రెండు హృదయాల కలయిక ప్రేమంటే.. అంటారు కొందరు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం నెలల తరబడి చూసుకోవడం, సంవత్సరాల తరబడి వెయిట్ చేయడం ఎవరికీ నచ్చడం లేదు. ఆన్ లైన్‌‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఎక్కడ కనిపించినా కంటికి నచ్చితే చాలు. ఛాటింగ్‌లతో పరిచయం ప్రారంభమై డేటింగ్‌ల వరకూ వెళ్తున్నారు యువతీ యువకులు. ఒకప్పుడు ఈ కల్చర్ విదేశాల్లోనే ఎక్కువ కనిపించేది. ఇప్పుడు ఇండియాలోనూ కామన్ అయిపోయింది.

అయితే ఇటీవల కొత్త డేటింగ్ ట్రెండ్ కూడా వచ్చేసింది. డేటింగ్‌లో ఉండగా పరస్పరం నచ్చినప్పటికీ ఎక్కువగా కలిసి తిరగడాలు, నేరుగా రొమాన్స్‌లోకి దిగిపోవానలి ఈతరం యువత కూడా భావించడం లేదట. కంటికి నచ్చడమే కాకుండా ముందు అవతలి వ్యక్తి తమకు ఎమోషనల్‌గా కనెక్ట్ కావడానికి ఫుల్ ప్రయారిటీ ఇస్తోందని ‘డేటింగ్ యాప్’ నిర్వహణ సంస్థల సర్వేలు పేర్కొంటున్నాయి. దీనినే ‘సిమ్మర్ డేటింగ్’ Simmar dating ర్కొంటున్నారు.

ఇటీవల ఓ డేటింగ్ యాప్ మేనేజ్ మెంట్ నిర్వహించిన సర్వే ప్రకారం.. మెట్రో సిటీస్‌తో పాటు కొన్ని పెద్ద పెద్ద నగరాల్లోని యువతలో దాదాపు 47 శాతం మంది యూత్ ‘సిమ్మర్ డేటింగ్’ పైనే ఆసక్తి చూపుతోంది. అంటే ఇక్కడ భాగస్వామి పరిచయం కాగానే కలిసి టూర్లూ, డిన్నర్లూ అంటూ సమయం వెచ్చించడానికి బదులు, పరస్పరం అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు యువతీ యువకులు. పరస్పర అవగాహన, ఆసక్తులు, అభిరుచులు వంటి అంశాల్లో నమ్మకం కుదిరితేనే, తమ మనసుకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయితేనే పర్మినెంట్ రిలేషన్ షిప్‌లోకి అడుగు పెట్టేందుకు నిర్ణయించుకుంటున్నారు. మొత్తానికి డేటింగ్, రిలేషన్‌షిప్ వంటి అంశాల్లో న్యూ జనరేషన్ చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed