BJPలో చేరిన వైసీపీ నేతలు

by karthikeya |   ( Updated:2024-10-27 06:46:27.0  )
BJPలో చేరిన వైసీపీ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైసీపీ (YCP) నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన పర్చూరు నియోజకవర్గ నేతలు భారీగా బీజేపీ (BJP)లో చేరారు. పార్టీ మారిన నేతలకు, కార్యకర్తలకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandheswari) స్వయంగా కండువా కప్పి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశానికి సుపరిపాల అందించడమే లక్ష్యమని, అందుకే ఏపీ అభివృద్ధి కోసం కూడా కేంద్రం నిధులు అందిస్తోందని తెలిపారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ.12,500 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని, అమరావతి (Amaravati), పోలవరం, రైల్వేలైన్ సహా అనేక అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తోందని పురంధేశ్వరి వెల్లడించారు.

కాగా.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా బంపర్ మెజారిటీతో విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓటమి పాలై కేవలం 11 సీట్లకే పరిమితమైపోయింది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన బడా నేతల నుంచి చోటా నేతల వరకు అనేక చోట్ల పార్టీని వీడి బీజేపీ, టీడీపీ (TDP), జనసేన (Janasena)ల్లో చేరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed