BRS: ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |
BRS: ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTRBRS) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెటాలియన్ కానిస్టేబుళ్లు.. ఏఈవో(AEO)ల వేటు అని దిన పత్రికల్లో వచ్చిన వార్తలపై ట్విట్టర్(X) వేదికగా స్పందించిన ఆయన పలు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతిని రగిల్చింది ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తుగ్లక్ నిర్ణయాలు కాదా?, రేవంత్ రెడ్డి(Revanth Reddy) అనాలోచిత విధానాలు కాదా? అని మండిపడ్డారు. అలాగే డిజిటల్ సర్వే పేరుతో ఏఈఓల మీద వేటు వేశారని, పనిభారం మీద ప్రశ్నించినందుకు పోలీసులపై వేటు వేశారని తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతి మనిషి ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ అని ఒకే ఆలోచలలో ఉన్నారని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story