Raghunandan Rao : రేవ్ పార్టీ నా? రావుల పార్టీ నా? వెంటనే ఫామ్‌హౌస్ సీసీ ఫుటేజీ బయట పెట్టాలి: బీజేపీ ఎంపీ

by Ramesh N |   ( Updated:2024-10-27 07:21:46.0  )
Raghunandan Rao : రేవ్ పార్టీ నా? రావుల పార్టీ నా? వెంటనే ఫామ్‌హౌస్ సీసీ ఫుటేజీ బయట పెట్టాలి: బీజేపీ ఎంపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR బంధువు రాజ్‌పాకాల జన్వాడ‌ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరిగినట్లు కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై ఆదివారం బీజీపీ ఎంపీ రఘునందన్ రావు MP Raghunandan Rao స్పందించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామని ఒకవైపు ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంటే.. హైదరాబాద్ చుట్టూ వీకెండ్ వచ్చిందంటే రేవ్ పార్టీలు, రావుల పార్టీలు అని జరుగుతున్నాయని, రాజులు, యువరాజులు కూర్చుని విదేశీ మాధకద్రవ్యాలతో పాటు, కోకైన్ లాంటి ఇతర డ్రగ్స్ తీసుకుంటున్నారని అన్నారు. భాగ్యనగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దందా కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిన్న రాత్రి ఒక ప్రముఖ రాజకీయ నాయుకుడి కుటుంబానికి సంబంధించిన Janwada Farm House ఫామ్‌హౌస్‌లో అర్థరాత్రి Rave Party రేవ్ పార్టీ జరిగిందని, దానిలోపల వీఐపీల పిల్లలు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CM Revanth Reddy ఆ ఫామ్‌హౌస్ యాజమానితోని కుమ్మక్కు కాకపోతే.. అయ్యా డీజీపీ 12 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి ఫామ్‌హౌస్‌లో ఎస్ఓటీ పోలీసులు రైడ్ సమయంలో ఫామ్‌హౌస్ లోపల, చుట్టూ ఉన్నా CCTV footage సీసీటీవీ ఫుటేజీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఈ మధ్య జన్వాడ ఫామ్‌హౌస్‌పై సీఎం ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదని, కేటీఆర్, రేవంత్ రెడ్డి రాజీ పడ్డారని ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. అందుకే అది రేవ్‌పార్టీ నా, రావుల పార్టీనా, డ్రగ్స్ ఉన్నాయా? ఫారిన్ లిక్కర్ ఉందా? ప్రజల ముందుకు తెలియజేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. Raj Pakala రాజ్ పాకాల ఫామ్ హౌస్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు వెంటనే బయటపెట్టాలని, ఆలస్యం చేస్తే ఎడిటింగ్ కార్యక్రమాలు మొదలవుతాయని ఆరోపించారు. ఎందుకంటే ముఖ్య నాయకులు, వారి పిల్లలను బయటకు పంపించి.. తర్వాత కొంత మంది అమాయకులను అరెస్ట్ చేశారని అనుకోవాల్సి వస్తుందని ఆరోపించారు.

Advertisement

Next Story