- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Massive floods:తెలుగు రాష్ట్రాల్లో వరదలు..భారీ విరాళం ప్రకటించిన రెబల్ స్టార్
దిశ,వెబ్‌డెస్క్:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత నాలుగు రోజులు భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు(Floods) విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే చాలామంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. మరికొంత మంది ప్రాణాలను కోల్పోయారు. తెలంగాణ(Telangana)లోని ఖమ్మం, ఏపీ(Andhra Pradesh)లో విజయవాడ నగరాలను వరదలు ముంచెత్తాయి. భారీ వరదలకు మున్నేరు నది ఖమ్మం పై , బుడమేరు వాగు విజయవాడ పై విరుచుకు పడ్డాయి. ఇళ్లన్నీ నీట మునగడంతో ప్రజలు కట్టుబట్టలతో సహాయక శిబిరాలకు(relief camps) చేరుకున్నారు. తిండి, నీరు కోసం అలమటిస్తున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు(Government) అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి.
టాలీవుడ్(Tollywood) చెందిన అనేక మంది ప్రముఖులు వరద బాధితుల(Victims) కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున విరాళాలు(Donations) అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabas) కూడా భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 2 కోట్లు భారీ విరాళం ప్రభాస్ ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ.1 కోటి చొప్పున మొత్తం 2 కోట్ల(2 Crore) రూపాయలను ఇస్తున్నట్లు తెలిపారు. అలానే వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకి భోజనాలు నీళ్లు ఏర్పాటు చేశారు. హీరో ప్రభాస్ కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు.