ఎన్టీఆర్ - సమీరారెడ్డి బ్రేకప్‌కు ఆ ప్రముఖ పొలిటిషియన్ కారణమా?

by Anjali |   ( Updated:2024-03-19 08:35:01.0  )
ఎన్టీఆర్ - సమీరారెడ్డి బ్రేకప్‌కు ఆ ప్రముఖ పొలిటిషియన్ కారణమా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి సుపరిచితమే. ఈ హీరో నటన, డాన్స్, మంచి మనసుతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో కొమురం భీముడో.. కొమురం భీముడో అనే సాంగ్ లో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు.

ఈ హీరో నటనలో జీవిస్తానడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ అటు ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూనే ఇటు సినిమాల్లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ సమీరా రెడ్డితో కలిసి పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు ప్రేమలో పడ్డట్లు అప్పట్లో నెట్టింట టాక్ వినిపించింది. ఆమెపై ఇష్టంతోనే ఎన్టీఆర్ కావాలని తన సినిమాలో పెట్టమని రికమండ్ చేసేవారట.

ఈ ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లడంతో.. తారక్ అమ్మ శాలిని వీరి వివాహానికి అంగీకరించలేదట. ఈ కారణంగా ఎన్టీఆర్-సమీరా రెడ్డి విడిపోయారట. అలాగే వీరి బ్రేకప్ కు కొడాలి నాని ఓ కారణమని వార్తలు వచ్చాయి. సమీరా - తారక్ గురించి ఎన్టీఆర్ వాళ్ల నాన్న హరికృష్ణ తో చెప్పి విడిపోయేలా చేశారని అప్పట్లో నెట్టింట జోరుగా చర్చించుకున్నారు. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Read More..

అత్యుత్సాహంతో స్టార్ హీరో విజయ్ కారును ధ్వంసం చేసిన అభిమానులు (వీడియో)

Advertisement

Next Story