Divorce : అనారోగ్యం కారణంగానే నాగచైతన్యకు విడాకులిచ్చిన సమంత.. ఆమె బంధువు చెప్పిన సీక్రెట్స్ వైరల్

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-16 12:03:37.0  )
Divorce : అనారోగ్యం కారణంగానే నాగచైతన్యకు విడాకులిచ్చిన సమంత.. ఆమె బంధువు చెప్పిన సీక్రెట్స్ వైరల్
X

దిశ, సినిమా : సమంత - నాగ చైతన్య విడాకుల టాపిక్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ప్రేమ పెళ్లి చేసుకుని అత్యంత అన్యోన్యంగా ఉన్న ఇద్దరూ అంతలోనే ఎలా విడిపోయారని ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారు అభిమానులు. కానీ ఇప్పటికీ అసలు రీజన్ ఏంటో తెలియలేదు. ఈ క్రమంలో సామ్ సమీప బంధువు ఓ కారణం చెప్పినట్లు నెట్టింట న్యూస్ వైరల్ అవుతుంది. ఈ వార్త విని షాక్ అవుతున్న జనాలు.. నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు.

నిజానికి చై అంటే సామ్ కు ప్రాణం అని.. ఆయన సుఖంగా ఉండాలనే విడాకులు తీసుకుందని తెలుస్తుంది. ముందుగానే అనారోగ్యం గురించి తెలిసి దూరంగా ఉన్నట్లు సమాచారం. భర్తతోనే ఉంటే ఇబ్బంది పడుతాడని తనే దూరమైందని టాక్. కాగా సామ్ మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే సినిమాలకు ఏడాది బ్రేక్ ఇచ్చింది. ఇంకా ట్రీట్మెంట్ కొనసాగిస్తున్న ఆమె.. తాజాగా ఇందుకు సంబంధించిన పిక్స్ రిలీజ్ చేసింది. ఇక సామ్ నటించిన సిటాడెల్ త్వరలో రిలీజ్ కానుండగా.. మరిన్ని ప్రాజెక్టులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చైతు తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Advertisement

Next Story