Big Boss 3: శృంగార వీడియో పై స్పందించిన జియో సినిమా..సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ

by Kavitha |   ( Updated:2024-07-24 04:11:17.0  )
Big Boss 3: శృంగార వీడియో పై స్పందించిన జియో సినిమా..సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ
X

దిశ, సినిమా: ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 ఎన్నో కాంట్రవర్సీలతో ముందుకెళ్తోంది. తాజాగా ఈ షో నుంచి ఓ వీడియో లీక్ కావడంతో అది సంచలనంగా మారింది. బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్గా వచ్చిన అర్మాన్ మాలిక్.. తన రెండో భార్య క్రితికా మాలిక్‌తో రొమాన్స్ చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోను చూసినవారందరూ షో పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బిగ్ బాస్‌ను నిషేధించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ వీడియో పై తాజాగా బిగ్ బాస్‌ను టెలికాస్ట్ చేస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయిన జియో సినిమా దీనిపై స్పందించింది. అసలు షో లో అలా జరగడం అసాధ్యం అంటూ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటనలో భాగంగా.. ‘‘జియో సినిమాలో ప్రసారమయ్యే ప్రతి కంటెంట్ విషయంలో మేము చాలా కఠినమైన ప్రోగ్రామింగ్ రూల్స్ పాటిస్తాం. జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్న బిగ్ బాస్‌లో అశ్లీల కంటెంట్ ఏం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌ను ఎవరో మార్ఫ్ చేశారు. అది పూర్తిగా ఫేక్. మేము మా గౌరవాన్ని, వ్యూయర్స్‌కు మా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ఇలాంటి ఒక వీడియో క్లిప్‌ను క్రియేట్ చేయడాన్ని, వైరల్ చేయడాన్ని మేము సీరియస్‌గా తీసుకుంటాం. అలాగే ఈ క్లిప్‌ని ఎవరు క్రియేట్ చేశారో, ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడానికి మా టీమ్ కష్టపడుతుంది. ఆపై వెంటనే బిగ్ బాస్ ఓటీటీ కంటెంట్ను, జియో సినిమా కంటెంట్ను ఇలా మార్చినందుకు వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం’’ అంటూ జియో సినిమా ప్రకటించింది.

కాగా అప్పటికే ఈ వీడియో వైరల్ కావడంతో శివసేన సెక్రటరీ అయిన ఎమ్మెల్యే డాక్టర్ మనీషా కాయాండే.. దీనిపై స్పందించారు. బిగ్ బాస్ ఓటీటీ పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని ముంబాయి పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సల్కార్కు ఫిర్యాదు చేశారు. యూత్ పై ఇలాంటి కంటెంట్ చాలా ప్రభావం చూపిస్తుందని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story