- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ravi Teja : రవితేజకు ముంబైలో కూడా మంచి డిమాండ్ ఉందా..?
దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. దేశంలోనే అతిపెద్ద గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు యువ దర్శకుడు వంశీ. కాగా ఈ మూవీ అక్టోబర్ 20న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇన్ని రోజులుగా ఇతర సౌత్ స్టార్ హీరోల మాదిరిగానే రవితేజ కూడా బాలీవుడ్‌కు వెళ్లలేదు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా పుణ్యమా అని ప్రతి తెలుగు చిత్రాన్ని అక్కడ కూడా విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా నార్త్‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం రవితేజకు ముంబైలో కూడా మంచి మార్కెట్ ఉందని తెలుస్తోంది. హిందీలో డబ్ అయిన సినిమాలకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ ఉంది. దీంతో ఈ చిత్రం వసూళ్లు రికార్డ్స్ బ్రేక్ చేస్తాయని అంటున్నారు విశ్లేషకులు.