వైరల్ అవుతున్న రష్మిక చెల్లెలు ఫోటోస్.. ఎంత క్యూట్‌గా ఉందో!

by Jakkula Samataha |
వైరల్ అవుతున్న రష్మిక చెల్లెలు ఫోటోస్.. ఎంత క్యూట్‌గా ఉందో!
X

దిశ, సినిమా : తన అందం, నటనతో చిత్ర పరిశ్రమను ఏలుతున్న బ్యూటీ రష్మిక మందన. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఈ చిన్నది ఫుల్ జోష్‌లో ఉంది. ఈ నటి ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నటి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా నేషనల్ క్రష్ రష్మిక తన క్యూట్ చెల్లి ఫోటోస్ షేర్ చేసింది. తన చెల్లి షిమాన్ మందన్న మే2న పుట్టిన జరుపుకుంది. ఈ నేపథ్యంలో రష్మిక తన ఇన్ స్టా స్టోరీలో..తన చెల్లితో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ.. హ్యాప్పీ బర్త్ డే మై క్యూట్ సిస్టర్..లవ్ యూ సో మచ్.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ తెలిపింది. తన చెల్లి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుంచి తన ప్రతి పని తానే దగ్గరుండి చూసుకునేదాన్ని అని, స్నానం, డైపర్స్ మార్చడం ఇలా ప్రతి పని చూసుకునేదాన్ని.. తనను ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా.. బిజీగా ఉండటం వలన తనకు దూరంగా ఉండాల్సి వస్తుంది. తాను ఎదుగుతున్న సమయంలో తన పక్కన లేకపోవడం చాలా బాధగా అనిపిస్తుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే. ఇక రష్మిక చెల్లికి ప్రస్తుతం 9 సంవత్సరాలు, రష్మికకు 28 సంవత్సరాలు, వీరి ఇద్దరి మధ్య 10 ఏళ్ల గ్యాప్ ఉంది.

Advertisement

Next Story

Most Viewed