- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandanna: కేరళ వయనాడ్ బాధితులకు సహాయం అందించిన రష్మిక.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు!
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రజెంట్ ‘పుష్ప 2’ తో బిజీగా ఉంది. పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈమె.. ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతుంది. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన వంతు సాయం చేసేందుకు ముందుకొస్తుంది. ఈ క్రమంలోనే మరోసారి తన మంచి మనసు చాటుకుంది నేషనల్ క్రష్. కేరళ వయనాడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడి సృష్టించిన విషాధం అందరికి తెలిసిందే. 358 మంది ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా.. కొంత మంది ఇంకా కొండచరియల్లో చిక్కుకుని ఉన్నారు.
వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ శ్రమిస్తూనే ఉన్నారు. అందులో స్టార్ హీరో మోహన్ లాల్ కూడా భాగమయ్యారు. ఇక విషాధంపై పలువురు స్పందిస్తున్నారు. అక్కడ చిక్కుకున్న భాదిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఈక్రమంలోనే పలువురు సెలబ్రెటీలు సైతం తోచిన సహాయం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు స్పందించి విరాళాలు ఇవ్వగా.. తాజాగా రష్మిక కూడా తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షలు విరాళం ప్రకటించింది.
దీంతో రష్మికపై పలువురు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. అదేంటీ సహాయం చేస్తే ప్రశంసిస్తారు కానీ ఎవరైనా ట్రోల్స్ చేస్తారా అనుకుంటున్నారా..? అసలు విషయం ఏంటంటే?.. రష్మిక కన్నడ బ్యూటీ అని తెలిసిందే. అక్కడ కొడుగు గాట్ సెషన్‌లలో భూమి క్షీణత జరిగి కొండచరియలు విరిగిపడి చాలా మంది మృత్యువాత పడ్డారు. చాలా మంది ఇళ్లు కూడా కోల్పోయారు. అయితే.. దీనిపై స్పందించాల్సిందిగా ఆ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో అభ్యర్థిస్తున్నారు. కానీ ఈ విషయంలో స్పందించకుండా .. ఇప్పుడు కేరళ వయనాడ్ బాధితులను ఆదుకోవడంతో కొంత మంది విమర్శిస్తున్నారు. సొంత ప్రాంత ప్రజలను ఆదుకోకుండా.. ఇప్పుడు ఎక్కడో జరిగిన దానికి సాయం చేస్తారా అని ట్రోల్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం.. ఎక్కడ చేస్తే ఏంటీ సహాయం చేసింది కదా అని సపోర్ట్ చేస్తున్నారు.