సముద్ర తీరాన బికినీలో తళుక్కుమన్న నేషనల్ క్రష్.. సొరచేప అందాలతో..

by Javid Pasha |
సముద్ర తీరాన బికినీలో తళుక్కుమన్న నేషనల్ క్రష్.. సొరచేప అందాలతో..
X

దిశ, సినిమా : నేషనల్ క్రష్‌ రష్మికా మందన్న అందరికీ సుపరిచితమే. ఓ వైపు భారీ ప్రాజెక్టులతో, మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో అలరిస్తున్న ఈ బ్యూటీ.. అంతకు మించి గ్లామర్ ట్రీట్ ఇస్తూ యువతను ఆకట్టుకుంటోంది. నిజం చెప్పాలంటే యానిమల్ చిత్రం ఇచ్చిన సక్సెస్ తర్వాత లెవల్ మరింత మారిపోయింది. నేషనల్ వైడ్ చిత్ర పరిశ్రమలు, అభిమానులు ఈమె గురించి చర్చించుకునేలా చేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతూనే ఉంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ మూవీ ‘సికిందర్’లోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. దీనికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే రష్మక నటించిన ‘పుష్ప 2’ ఆగష్టులో రిలీజ్ కానుంది.

ఓ వైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లోనూ తన సత్తా చాటుతోంది రష్మిక. ‘ది గర్ల్ ఫ్రెండ్‌’, ‘రెయిన్‌బో’ వంటి సినిమాలు ఇటువంటి బ్యాగ్రౌండ్‌తోనే తెరకెక్కుతుండగా తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అట్లనే ధనుష్‌, నాగార్జున నటిస్తున్న ‘కుబేరా’లోనూ హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా తన అంద చందాలతో మరోసారి రెచ్చిపోయింది రష్మికా మందన్న. స్టన్నింగ్ లుక్స్‌తో యువతకు హాట్ ట్రీట్ ఇచ్చింది. అందమైన సముద్రపు తీరాన బికినీలో మెరిసిన ఈ భామ సొరచేపలాంటి అందాలతో అభిమానులను చూపు తనవైపు తిప్పుకుంది. ప్రజెంట్ ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాల కామెంట్స్‌తో, ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా కాగా ఆమె ట్రావెల్ లీజర్ మ్యాగజైన్ కోసం ఈ హాట్ ఫొటో షూట్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed