అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు ఖాయమని ముందే చెప్పిన రష్మిక (వీడియో)

by Anjali |   ( Updated:2023-08-29 05:50:06.0  )
అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు ఖాయమని ముందే చెప్పిన రష్మిక (వీడియో)
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో మెగా అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌‌కు నేషనల్ అవార్డు వస్తుందని హీరోయిన్ రష్మిక మందన్న ముందే చెప్పింది. ‘పుష్ప’ సక్సెస్ మీట్‌లో మాట్లాడిన ఆమె.. ‘అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డుతో పాటు పలు అవార్డులు వస్తాయి. ఈ చిత్రం కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. కేవలం మేకప్ ‌కోసమే మూడు గంటల సమయం పట్టేది. ఆయన కష్టానికి ఫలితం దక్కుతుంది. ఒక వేళ అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు రాకపోతే మొదట బాధపడేది నేనే’ అని చెప్పింది రష్మిక. ఇక ఇప్పుడు ఆమె అన్నట్లుగానే అల్లు అర్జున్‌ను నేషనల్ అవార్డు వరించడంతో.. ఇందుకు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed