ఆ అమ్మాయికి ఫిదా అయిపోయిన రణబీర్.. ఏకంగా కాళ్లు మొక్కి హగ్ ఇచ్చి.. (వీడియో)

by sudharani |   ( Updated:2023-11-28 14:41:38.0  )
ఆ అమ్మాయికి ఫిదా అయిపోయిన రణబీర్.. ఏకంగా కాళ్లు మొక్కి హగ్ ఇచ్చి.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సోనీ టీవీలో ప్రచారం అవుతున్న షోలలో సింగింగ్ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 14’ ఒకటి. ఈ షోలో ‘షాందార్ పరివార్’ ప్రత్యేక ఎపిసోడ్ ప్రకారం కాబోతోంది. ఈ సందర్భంగా ‘యానిమల్’ సినిమా జోడీ రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన పాల్గొన్నారు. జడ్జిలుగా వ్యవహరించిన వీళ్లిద్దరూ కంటెస్టెంట్ల పెర్ఫార్మెన్స్‌లను ఎంత గానో ఎంజాయ్ చేశారు. అయితే.. ఈ క్రమంలోనే రణ్‌బీర్ కపూర్ చేసిన పని అందరిని ఆకర్షిస్తుంది.

మేనక పౌదేల్ అనే అంధ గాయని ‘అగర్ తుమ్ సాత్ హో’ అనే పాట పాడారు. ఈ పాటను అక్కడ ఉన్నవారంతా ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఇక రణ్ బీర్ కపూర్ ఆమె పాటను ఎంతో మధురంగా ఆలకించి ఆనందపడిపోయారు. రష్మికతో కలిసి స్టేజ్ పైకి వెళ్లి ఆ గాయని కాళ్లు మొక్కాడు. అనంతరం మేనకతో మాట్లాడుతూ.. నా పేరు రణ్‌బీర్ అని పరిచయం చేసుకుని మీరు ఆ సాంగ్ ఎంతో చక్కగా పాడారు. శ్రేయ ఈ పాటను మొదటిసారి పాడినప్పుడు అందరికీ ఏ ఫీలింగ్ కలిగిందో ఇప్పుడు అదే ఫీలింగ్ కలుగుతోంది’ అంటూ కితాబు ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. రణ్‌బీర్ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story