ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్న రణ్‌బీర్.. ఆమె కోసమే రిస్క్ చేస్తున్నట్లు వెల్లడి

by Prasanna |   ( Updated:2023-10-25 10:32:42.0  )
ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్న రణ్‌బీర్.. ఆమె కోసమే రిస్క్ చేస్తున్నట్లు వెల్లడి
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌బీర్ కపూర్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. కొంతకాలంపాటు సినిమాలకు దూరం కాబోతున్నట్లు అధికారంగా ప్రకటించాడు. రీసెంట్‌గా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఆయన.. ‘యానిమల్’ మూవీ తర్వాత ఏ ప్రాజెక్ట్‌కు కమిట్‌మెంట్ ఇవ్వలేదని, కూతురు రాహాతో గడిపేందుకు ఆరు నెలల పాటు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘వచ్చే నెలలోనే రాహా ఫస్ట్ బర్త్ డే. బిజీ షెడ్యూల్ కారణంగా ఆమెతో పెద్దగా సమయం గడపలేకపోయా. అందుకే సరైన సమయంలో బ్రేక్ తీసుకుంటున్నా. రాహా ఇప్పుడు బాగా గుర్తుపడుతోంది. మాపై ఎంతో ప్రేమ కురిపిస్తోంది. ప, మ అనే పదాలను పలికేందుకు ట్రై చేస్తోంది. ఆమెతో గడపడం నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed