- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాకిస్తాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేయాలనుంది: రణబీర్ కపూర్
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ పొరుగు దేశాలకు చెందిన నటీనటులతో కలిసి పనిచేయడంకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇటీవల సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన 'రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్'కు హాజరైన నటుడు..వెరైటీ ఇంటర్నేషనల్ వాన్గార్డ్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా రీసెంట్ ఇంటర్వ్యూలో ఫిల్మ్ ఇండస్ట్రీలను ఉద్దేశిస్తూ మాట్లాడిన రణ్బీర్..కళాకారులకు, ముఖ్యంగా కళలకు హద్దులు ఉండవని భావిస్తున్నట్లు చెప్పాడు. అలాగే సౌదీ అరేబియా వంటి దేశ పరిశ్రమలతోనూ పనిచేయాలనే ఆలోచన ఉందని, అవకాశం ఉంటే ఒక చిత్రానికి సైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఇక పాకిస్తానీ బృందంతోనూ కలిసి పనిచేయడాన్ని చాలా ఇష్టపడాతానన్న హీరో..'ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్' మూవీ ఘనవిజయం సాధించినందుకు పాకిస్థాన్ చిత్ర పరిశ్రమకు, సహనటుడు ఫవాద్ ఖాన్కు అభినందనలు. ఇటీవల కాలంలో మనం చూసిన అతిపెద్ద హిట్లలో ఇది ఒకటి. నేను ఈ చిత్రాన్ని చాలా ఇష్టపడతాను' అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు.
Also Read.....
మంచి భర్త దొరికితే చాలు.. కెరీర్కు ఎలాంటి భయం లేదంటున్న.. Yami Gautam !