రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు.. ఆయన లైఫ్ జర్నీ ఇదే!

by Jakkula Samataha |
రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు.. ఆయన లైఫ్ జర్నీ ఇదే!
X

దిశ, సినిమా : రైతు కుటుంబంలో జన్మించి, ఊరూరా తిరుగుతూ పచ్చళ్లు అమ్మే వ్యక్తి ఒక్కసారిగా పెద్ద వ్యాపార వేత్తగా మారాడు. లక్షల మందికి ఆయన ఉద్యోగం ఇచ్చాడంటే అది సామాన్యమైన విషయం కాదు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు, కఠోర శ్రమనే సక్సెస్‌కు కారణం అని ఆయన నిరూపించారు. చిన్న వ్యాపారం మొదలు పెట్టి, కొన్నివేళ సంస్థలకు అధినేతగా మారాడు అంటే దానికి వెనుక ఆయన కష్టం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతో మంది విద్యార్థులకు తన జర్నలిజం స్కూల్ ద్వారా అక్షరాలు దిద్దించి, వారి బంగారు భవిష్యత్తుకు కారణమయ్యాడు. అలాంటి వ్యక్తి ఈరోజు లేడు అనేది ఎవరూ ఊహించలేరు. కాగా, అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చెరుకూరి రామోజీరావు నవంబర్ 16న 1936లో పెదపరుపూడి గ్రామం కృష్ణా జిల్లాలో, ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయన తన తొలి రోజుల్లో ఊరురా తిరుగుతూ పచ్చళ్లు అమ్మేవారు. తర్వాత కుటుంబ జీవనాధారం కోసం తన పొలాన్ని అమ్మి 1962లో హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టి, వ్యాపారం చేయడానికి పూనుకున్నాడు. మార్గదర్శి చిట్ ఫండ్స్‌ను ఇద్దరు ఉద్యోగులతో కలిసి ప్రారంభించి చివరకు వాటిని బ్రాంచ్‌లుగా ప్రారంభించారు. అలా తాను తన వ్యాపారంలో విజయంతో దూసుకెళ్ళాడు. తర్వాత తాను ఒక రైతు బిడ్డ కాబట్టి, రైతుల గురించి ఆలోచించి, వారి కోసం అన్నదాత మాస పత్రికను ప్రారంభించి, వ్యవసాయం చేసే వారికి దాని ద్వారా సలహాలు అందించారు. ఆ తర్వాత 1974 ఆగస్టు 10న పాత ప్రింటింగ్ మిషన్‌తో ఈనాడు ప్రారంభించారు. ఆ తర్వాత ఒకొక్కటిగా.. ప్రియ ఫుడ్స్, ఈటీవీ, మీటీవీ, కళాంజలి, రామోజీ ఫిల్మ్ సిటీ, ఉషాకిరణ్ మూవీస్,ఇలా కొత్త కొత్తగా ఆలోచిస్తూ వీటన్నింటిని స్థాపించారు.

ముఖ్యంగా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది? అనే తన ఆలోచనకు ఒక రూపం ఇచ్చి రామోజీ ఫిల్మ్ సిటీనీ 1660 ఎకరాల విస్తీరణంలో నిర్మించారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాధించుకుంది

Advertisement

Next Story

Most Viewed