- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Gopal Varma: అలాంటి సినిమాలు చాలా డేంజర్ అంటున్న రామ్ గోపాల్ వర్మ
దిశ, సినిమా: హీరో రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి కలిసి నటిస్తున్న మూవీ ‘రామాయణం’. తాజాగా, ఈ సినిమా పై రామ్‌గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పురాణాల ఆధారంగా మూవీస్ చేయడం అంత ఈజీ కాదని అంటున్నారు. ఆర్జీవీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సీనియర్ నటుడు ఎన్టీ రామారావు ఉన్న కాలంలో వీటిని చాలా మంది చూసే వాళ్ళు కానీ, ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఏదైనా దేవుడి సినిమాలు వస్తే భక్తితో చూస్తున్నారు తప్ప చూడాలని ఎవరు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాల్సిన విషయం.. భక్తి సినిమాలో కొంచం తప్పుగా అనిపించినా మత పెద్దలు విమర్శించే అవకాశం లేకపోలేదు.. కాబట్టి నేను అలాంటి సినిమాలు ఎప్పటికి తీయను. సినిమా తీసాక హిట్ అవుతుందా.. ఫ్లాప్ అవుతుందా అనేది పక్కన పెడితే లేని పోనీ పంచాయితీలు ఎక్కువవుతాయి. దీని కారణంగా విభేదాలు, విమర్శలు తప్ప లాభం ఏం లేదు. ఆదిపురుష్ మూవీ విషయంలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. ఇలాంటి మూవీస్ చాలా డేంజర్.. రామాయణం లాంటి సినిమా చేసేందుకు ధైర్యం చేస్తున్నారంటే మాములు విషయం కాదు.. వారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను” అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసాడు.