రామ్ చరణ్ అంటే పిచ్చి.. తనతో ఒక్కసారి అయినా ఆ పని చేయాలని ఉందంటూ తన కోరిక బయటపెట్టిన మాజీ ప్రపంచ సుందరి

by Kavitha |   ( Updated:2024-04-23 10:38:00.0  )
రామ్ చరణ్ అంటే పిచ్చి.. తనతో ఒక్కసారి అయినా ఆ పని చేయాలని ఉందంటూ తన కోరిక బయటపెట్టిన మాజీ ప్రపంచ సుందరి
X

దిశ,సినిమా: స్టార్ హీరో రామ్ చరణ్ చిరుత మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అప్పటి నుంచి తనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇస్తాడు. తుఫాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విమర్శలు మూటగట్టుకున్న రామ్ చరణ్ తర్వాత రోజుల్లో ఆర్.ఆర్.ఆర్( RRR ) సినిమాతో తనపై వచ్చిన విమర్శలకు గట్టిగా బదులిచ్చారు.

అయితే తాజాగా ప్రముఖ నటి, మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె తెలుగులో ‘ఆపరేషన్ వాలంటైన్’ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడం వలన మానుషి చిల్లర్ కు తెలుగులో పెద్దగా ఆకట్టుకునే ఛాన్స్ రాలేదు. కాగా చరణ్ గురించి ఈ బ్యూటీ మాట్లాడుతూ చరణ్ కు జోడీగా నటించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. రామ్ చరణ్ యాక్టింగ్ స్కిల్స్ కు తాను పెద్ద ఫ్యాన్ అని ఆమె అన్నారు. చరణ్ అంటే నాకెంతో ఇష్టం అని చెప్పుకొచ్చారు.చరణ్ కు జోడీగా ఒక్క సినిమాలో అయినా నటించాలని చాలా రోజుల నుంచి కలలు కంటున్నానని ఆమె పేర్కొన్నారు. తెలుగులో నా నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ తో ఉండాలని మానుషి చిల్లర్ కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు స్టార్ హీరో రామ్ చరణ్ దృష్టికి వస్తే చరణ్ ఆమెకు అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.

Advertisement

Next Story

Most Viewed