- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగాస్టార్ అసలు క్యారెక్టర్ బయటపెట్టిన రామ్ చరణ్.. ఇంట్లో ఇలా ఉంటారంటూ సంచలన కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన చిరు నటనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. మెగాస్టార్ ఏ ఈవెంట్లకు హాజరైన ఎవరినైనా సరే మంచి మనసుతో నవ్వుతూ పలకరిస్తారు. పలు సినిమా ఈవెంట్లలో అయితే చిరు వేదిక ఎక్కిందంటే చాలు అక్కడ ఆద్యంతం నవ్వులు పూయాల్సిందే.
సరదాగా పంచ్ లు వేస్తూ.. ఆటపట్టిస్తూ, ఇమిటేట్ చేస్తూ నవ్విస్తుంటారు. అయితే బయట ఇంత సరదాగా ఉన్న మెగాస్టార్ ఇంట్లో ఎలా ఉంటాడు? కుటుంబ సభ్యులతో ఎలా మూవ్ అవుతాడు? ఇంట్లో డాన్స్ చేస్తూ అలరిస్తారా? ఫ్యామిలీ మెంబర్స్ తో జోవియల్ గా ఉంటారా? అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తే ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రామ్ చరణ్ ఈ విషయం పై స్పందించి.. ఇంట్లో పూర్తిగా భిన్నంగా ఉంటారని చెప్పుకొచ్చాడు.
ఇంట్లో ఫన్ చేయడం గానీ, ఇతరులను నవ్వించడం గానీ అస్సలు చేయరట. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా నవ్వితే నవ్వుతారట. ఇంట్లో ఎప్పుడు డాన్స్ చేయడం చూడలేదని చరణ్ తెలిపాడు. కాకపోతే నాన్న చాలా ఫ్రీగా ఉంటాడు. ఏదైనా ఓపెన్ మాట్లాడుతారని, ఆయన మూడ్ బాగుందా? అలసిపోయాడా? అని చూసుకుని వెళ్లి మాట్లాడతానని చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.