ఒకే ఫ్రేమ్‌లో రామ్‌చరణ్-మహేష్ బాబు.. ఫొటో వైరల్

by Prasanna |   ( Updated:2023-09-26 14:40:50.0  )
ఒకే ఫ్రేమ్‌లో రామ్‌చరణ్-మహేష్ బాబు.. ఫొటో వైరల్
X

దిశ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా భారీ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ఇందులో మహేష్ బాబు అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. ఇక తెలుగు సినిమా దిగ్గజ నటుడు దివంగత హీరో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. దాదాపు సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఇందులో భాగంగానే ANR విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్‌లు కూడా పాల్గొన్నారు. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story