జగదేక వీరుడిలా రామ్ చరణ్.. అతిలోక సుందరిలా జాన్వీ ( వీడియో)

by Jakkula Samataha |
జగదేక వీరుడిలా రామ్ చరణ్.. అతిలోక సుందరిలా జాన్వీ ( వీడియో)
X

దిశ, సినిమా : జగదేక వీరుడు.. అతిలోక సుందరి సినిమా అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా రీమేక్ వస్తే బాగుంటుదని చాలా మంది మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే? ఏడేళ్ల కిందట ఓ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మెగాడాటర్ నిహారిక రామ్ చరణ్, చిరంజీవిలను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో చరణ్‌ను నిహారిక నువ్వు చిరంజీవి సినిమాల్లో రీమేక్ చేయాలంటే ఏ సినిమా చేస్తావ్ అని ప్రశ్నించగా.. చెర్రీ గ్యాంగ్ లీడర్ అని సమాధానం చెబుతాడు.అదే ప్రశ్న చిరును ప్రశ్నించగా.. చెర్రీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీమేక్ చేయాలనుకుంటాను అని చెప్తాడు. అప్పుడు నిహారిక హీరోయిన్ ఎవరు అని అడగ్గా.. ఠక్కున శ్రీదేవి కూతురు జాన్వీ అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే ఇప్పుడు జాన్వీ, రామ్ చరణ్ ఆర్‌సీ 16లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. వారు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీమేక్ చేయకున్నా.. చిరు, శ్రీదేవిలా జాన్వీ, చరణ్‌ను ఊహించుకొని ఆనందపడిపోతున్నారు.

ఈ క్రమంలోనే ఏఐ సహాయంతో జగదేకవీరుడిలో రామ్ చరణ్..అతిలోక సుందరిలా రామ్ చరణ్‌న సెట్ చేసి ఉనన్న వీడియోను Xలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఇది చూసిన నెటిజన్స్ సూపర్ కాంబినేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ వీడియోను జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసి, అందాల ముద్దుగుమ్మ జాన్వీకి బర్త్ డే విషెస్ తెలిపారు.

Advertisement

Next Story