రకుల్‌కు ఏమైంది.. మంచుకొండల్లో -15°C లో చికిత్స (వీడియో)

by sudharani |   ( Updated:2023-05-06 12:22:52.0  )
రకుల్‌కు ఏమైంది.. మంచుకొండల్లో -15°C లో చికిత్స (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా అనతికాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌పై కాన్సంట్రేట్ చేసిన భామ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే కనిపిస్తుంది. ఎప్పుటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లూ బికినీలో క్రయోథెరపీ చేయించుకుంటున్న వీడియోను షేర్ చేసింది బ్యూటీ. -15°Cలో గడ్డకట్టిన మంచు మధ్యలో ఐస్ బాత్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. రకుల్ చలిలో కూడా మంట పుట్టిస్తోందని అంటున్నారు నెటిజన్స్.

Also Read: మొదటిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ కు అనుష్క శర్మ

Advertisement

Next Story