కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన రకుల్.. ప్రారంభం ఎప్పుడంటే..?

by sudharani |   ( Updated:2024-04-12 09:27:08.0  )
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన రకుల్.. ప్రారంభం ఎప్పుడంటే..?
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అనతికాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాకుండా టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే.. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఫిబ్రవరి 21 న ఈకో-ఫ్రెండ్లీ పద్ధతిలో గావాలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.

ఇక ప్రస్తుతం పెళ్లి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది ఈ బ్యూటీ. తన అందాలతో ట్రెండీ అవుట్ ఫిట్‌లతో కుర్రాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అంతే కాకుండా.. తనుకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తను కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. హైదరాబాద్‌లో ‘ఆరంభం’ పేరుతో త్వరలో రెస్టారెంట్ స్టార్ట్ చెయ్యనుంది. ఇందులో మిల్లెట్స్‌తో తయారు చేసిన ఫుడ్ లభించనుంది. అయితే.. ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story