Mahesh Babu: రూ.1000 కోట్ల బడ్జెట్ కోసం రాజమౌళి ప్లాన్.. రికవరీ చేయగలదా?

by Prasanna |
Mahesh Babu: రూ.1000 కోట్ల బడ్జెట్ కోసం రాజమౌళి ప్లాన్.. రికవరీ చేయగలదా?
X

దిశ, సినిమా: రాజమౌళి, మహేష్ బాబు కాంబో లో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సినిమా తెలిసిందే. అయితే, ఈ మూవీకి సంబందించిన వివరాలు ఇంకా అధికారికంగా వెలువడలేదు. ఇంకోవైపు కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం, ముంబైలో రాజమౌళి మూవీ పనుల మీద బిజీగా ఉన్నారు. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ పతాకం పై కె.ఎల్.నారాయణ్ ఈ భారీ సినిమాని నిర్మించబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీ గురించి ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

మహేష్, రాజమౌళిల డ్రీమ్ ప్రాజెక్టు కోసం రూ.1000 కోట్లు దాటుతుందని అంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో రికవరీ చేయగలదా అనే సినీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. అందువల్ల ఈ సినిమాని పార్ట్ 1 , పార్ట్ 2 గా విడుదల చేయాలని రాజమౌళి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇది మాత్రమే కాకుండా పార్ట్ 3 ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇంత వరకు ఈ మూవీ గురించి చిన్న అప్డేట్ కూడా లేదని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీరికి త్వరలో గుడ్ న్యూస్ చెప్పాలని, అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఆగస్టు 9న రివీల్ చేయనున్నారని టాక్ బాగా నడుస్తుంది.

Advertisement

Next Story