SS Rajamouli: ద్విపాత్రాభినయంలో అదరగొట్టిన రాజమౌళి!

by Anjali |   ( Updated:2023-07-04 07:54:55.0  )
SS Rajamouli:  ద్విపాత్రాభినయంలో అదరగొట్టిన రాజమౌళి!
X

దిశ, సినిమా: మనకు తెలిసి చాలా మంది సినీ ప్రముఖులు, క్రీడకారులు ఎక్కువ పేరున్న కంపనీలకు ప్రచారకర్తలుగా ఉంటారు. రెమ్యునరేషన్ ఆధారంగా బ్రాండ్‍ అంబాసిడర్లుగా యాడ్స్ చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కూడా ప్రఖ్యాత మొబైల్ ఫోన్ ‘ఒప్పో’కు బ్రాండ్ అంబాసిడర్‌ అవతారమెత్తాడు. రీసెంట్‌గా యాడ్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో కంపెనీ నుండి కొత్త ఫోన్‌ను ప్రదర్శించారు జక్కన. ఇక ఈ కమర్షియల్‌ యాడ్‌లో రాజమౌళి డబల్ రోల్‌లో స్టైలిష్‌గా కనిపించారు. ప్రజంట్ ఈ టీజర్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read More: రామ్ చరణ్, ఉపాసనను పట్టించుకోకుండా.. ఆ విషయంలో చిరు సంచలన నిర్ణయం

Advertisement

Next Story

Most Viewed