అడ్డంగా దొరికిపోయాడు.. పెళ్లి చేసుకోలేదని చెప్పిన అమ్మాయికి విడాకులు ఇస్తానంటున్న రాజ్ తరుణ్

by Prasanna |   ( Updated:2024-07-11 03:59:53.0  )
అడ్డంగా దొరికిపోయాడు.. పెళ్లి చేసుకోలేదని చెప్పిన అమ్మాయికి విడాకులు ఇస్తానంటున్న రాజ్ తరుణ్
X

దిశ,సినిమా: సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ ప్రేమాయణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. అతనేమో నా బతుకు నన్ను బతకనివ్వవా అంటాడు.. ఈమె ఏమో నా బతుకే నువ్వే అంటూ పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరుగుతూ ఉంది. ఇక్కడ తప్పు చేసింది ఎవరో కూడా అర్ధం కానీ ప్రశ్న లాగా అయిపొయింది. ఇవన్నీ చూసి విసిగిపోయిన నెటిజెన్స్ సినిమాలలో హీరో పాత్రలు.. రియల్ లైఫ్ లో ఇలాంటి చెత్త పంచాయితీలు.. మీరు సమాజానికి ఇచ్చే మెసేజ్ లు ఇవా అంటూ సినీ నటులను ఏకిపారేస్తున్నారు.

బాధితురాలు లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇది సినిమా కథలాగా వెళ్తుంది నమ్మలేని షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మళ్లీ కొత్త ట‌ర్న్ తీసుకుంది. ఇప్పుడు దేశం మొత్తం టాలీవుడ్ వైపే చూస్తుంది.

అయితే.. రాజ్‌తరుణ్‌ తనని పెళ్లి చేసుకుని పదేళ్లు కాపురం కూడా చేశాడని .. కొద్దీ రోజుల క్రితం అబార్షన్ కూడా చేయించాడంటూ లావణ్య ఆరోపించింది. వాటికి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్‌ కూడా సబ్మిట్ చేసానని చెబుతుంది. మొన్నటి వరకు పెళ్లి చేసుకోలేదని చెప్పిన రాజ్ తరుణ్ .. ఇప్పుడు రూట్ మార్చి విడాకులు ఇస్తానంటున్నాడంటూ అడ్వొకేట్ కల్యాణ్ దిలీప్ సుంకర మీడియా ముందు వెల్లడించాడు. ముందు పెళ్లి కాలేదని చెప్పి.. ఇప్పుడేమో డివోర్స్ మాట ఎత్తి.. రాజ్ తరుణ్ అడ్డంగా దొరికిపోయాడు.

Advertisement

Next Story