సమంత కారణంగా అక్కినేని ఫ్యామిలీలో గొడవలు?

by samatah |   ( Updated:2023-04-11 05:35:01.0  )
సమంత కారణంగా అక్కినేని ఫ్యామిలీలో గొడవలు?
X

దిశ, వెబ్‌డెస్క్ : సమంతకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత, అటు సమంత, ఇటు చైతన్య మీదనే కాకుండా,అక్కినేని ఫ్యామిలీ మీద కూడా అనేక రూమర్స్ వస్తున్నాయి.

అయితే తాజాగా సమంత కారణంగా అక్కినేని ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్లు ఓ రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే అఖిల్ బర్త్ డే కి సమంత విష్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా, ఏజెంట్ సినిమా గురించి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అలాగే అఖిల్ కూడా మయోసైటీస్ వ్యాధితో సమంత బాధపడుతున్నప్పుడు, అఖిల్ నువ్వు త్వరగా కోలుకోవాలి సామ్ అంటూ ట్వీట్ చేశాడు. అయితే విడాకుల తర్వాత కూడా సమంత, అఖిల్ ఇంత క్లోజ్‌గా ఉండటం నాగచైతన్యకు నచ్చడం లేదంట.

ఈ విషయంలోనే అక్కినేని ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని, అంతే కాకుండా అఖిల్, చైతూ మధ్య కూడా గొడవలు జరుగుతున్నట్లు చాలా వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్తలను మాత్రం అక్కినేని అభిమానుల కొట్టిపారేస్తున్నారు.

Read more:

Shakuntalam: 'శాకుంతలం' సినిమా నాకొక పెద్ద బాధ్యత: సామ్

Advertisement

Next Story

Most Viewed